కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. మొదట కాస్త భయపడినా ఇప్పుడు అందరూ షూటింగ్స్ ను మొదలుపెట్టేసారు. ఇక థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు కానీ అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆదిపురుష్ టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మరి చూద్దాం ప్రస్తుతం అయితే రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు. మరి ఈ రెండు సినిమాలు అయిపోవాలి.. అప్పుడు ఆదిపురుష్ షూటింగ్ మొదలవ్వాలి. మరి ఈలోపు ఏమైనా జరగొచ్చు..
View this post on Instagram
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























