బిగ్ బాస్ 4 – అభిజిత్ కు మోనాల్ సోదరి కౌంటర్

Bigg Boss Day"74" Highlights: Monal Gives Strong Counter To Abhijeet

ఇక మొన్నటి ఎపిసోడ్ లో నలుగురు కంటెస్టెంట్ ల పేరెంట్స్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్ల పేరెంట్స్ వచ్చారు. ఇక ఎపిసోడ్ స్టార్టింలోనే అఖిల్ తన మదర్ గురించి మోనాల్ తో డిస్కషన్ చేస్తుంటాడు. అమ్మ మొద‌టిసారి నాకు ఐ ల‌వ్ యూ చెప్పింద‌ని అఖిల్ హ్యాపీగా ఫీల‌య్యాడు. అమ్మ త‌న పేరును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంద‌ని త‌ను చాలా పొసెసివ్ అని మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అందుకే నీతో ఎక్కువ‌గా మాట్లాడ‌లేదని తెలిపాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో కొంచం సేపు ఆడుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కమాండోస్ డ్రిల్ చేస్తుండగా మొదట అనంత‌రం అరియానా స్నేహితుడు విన‌య్ హౌస్‌లోకి వ‌చ్చాడు. అత‌న్ని చూడ‌గానే అరియానా పెద్దగా ఏడ్చేస్తూ అందరూ ఎలా ఉన్నారని.. కనీసం తనని కూడా మాట్లాడనివ్వకుండా ఆమెనే మాట్లాడేసింది. త‌న క‌ష్ట‌సుఖాల్లో ప్ర‌తిసారి ఇత‌డే ఉన్నాడ‌ని తెలిపింది. అన్నం లేని స‌మ‌యంలో దొంగ‌లాగా అత‌ని ఇంటికి వెళ్లి తినేదాన్ని అని చెప్తూ ఐ ల‌వ్ యూ విన‌య్ అంటూ సంతోషంతో గెంతులు వేసింది.

త‌ర్వాత బిగ్ బాస్ మోనాల్ కు వాళ్ల అమ్మ వాయిస్ వినిపించాడు. మోనాల్ పాపా ఎలా ఉన్నావు, నువ్వు చాలా గుర్తొస్తున్నావు. హైద‌రాబాద్‌కు రాలేక‌పోయాము అని చెప్పింది. ఇక దీనితో మోనాల్ ఎప్పటిలాగే బోరున ఏడ్చేసింది. అంతేకాదు బిగ్ బాస్ పై కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ నా ఎమోష‌న్స్‌తో ఆడుకోకు బిగ్‌బాస్‌.. నాకు కోపం వ‌స్తుంది అంటూ ఏదో ఒక‌టి చెప్ప‌మ‌ని బిగ్‌బాస్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇక కొద్దిగా డ్రామా ఆడిన తర్వాత మోనాల్ సోద‌రిని హౌస్ లోపలి పంపించారు. ఇక సోదరిని చూసిన మోనాల్ కన్నీరు పెట్టుకుంది. ఇక కొంచం సేపు మాట్లాడుకున్న తర్వాత నా గురించి అఖిల్ గురించి చెడుగా అనుకుంటున్నారా అంటూ అడుగగా.. అలాంటిదిఏం లేదని చెప్పింది. సోహైల్‌తో నువ్వంటే ఇష్ట‌మ‌ని.. అవినాష్‌ను అంద‌రితో ఫ్లర్ట్ చేయడమేనా అని కౌంట‌ర్ ఇచ్చింది. మెయిన్ హైలైట్ ఏంటంటే మంచైనా చెడైనా ఏదైనా ఉంటే తన ముందే మాట్లాడమని చెప్పింది.దీనికి అభి కూడా కొంచం హర్ట్ అయినట్లే తెలుస్తుంది.

త‌ర్వాత సోహైల్ తండ్రి స‌లీమ్ హౌస్ లోపలి వ‌చ్చాడు.బ‌య‌ట క‌థ వేరే ఉంద‌ని.. వీడు మా తాత‌లాగే ఉంటాడ‌ని, అందుకే సోహైల్‌ను తాత అని పిలుస్తామ‌ని తెలిపాడు. ఇక అమ్మ బాగుందా అని సోహెల్ అడగగా.. మేము అందరం బాగానే నువ్వు బాగా ఉండు.. అప్పుడే కోప్పడతావ్ అప్పుడే కూల్ అవుతావు అని కామెడీ చేసాడు. త‌ర్వాత మోనాల్‌, లాస్య, సోహైల్‌.. అఖిల్ మాట్లాడుకుంటుండగా బిగ్ బాస్ కొంచం సేపు వారితో కామెడీ చేసాడు.

ఇక ఫైనల్ గా లాస్య కోసం రావాల్సి ఉంది. ఈ రోజు ఎపిసోడ్ లో జున్ను, భర్త రానున్నారు. ఇక కెప్టెన్ టాస్క్ కూడా ఈ రోజే జరుగుతుంది. మరి చూద్దాం ఎవరు కెప్టెన్ అవుతారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.