తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ బ్లాక్ బస్టర్ “ఛష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ మూవీస్ తో పాటు తాప్సీ తెలుగు , తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుంటున్నారు. “పింక్ “, నామ్ షబానా “, “బద్లా “, “శాండ్ కీ ఆంఖ్” , “తప్పడ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తాప్సీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“అన్నాబెల్లె సుబ్రమణియమ్ “తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాప్సీ బాలీవుడ్ మూవీ “హసీనా దిల్ రుబా ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ మూవీ లో తాప్సీవర్క్ రెండురోజులు బ్యాలెన్స్ ఉంది. తాప్సీ ఇప్పుడు మ్యాంగో పీపుల్ మీడియా , RSVP బ్యానర్స్ పై ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “రష్మీ రాకెట్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. గుజరాతీ గర్ల్ ఫాస్ట్ రన్నర్ రష్మీ పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ మూవీ లో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీ ఫిట్ నెస్ కై వర్కౌట్స్ చేస్తున్నారు. తాప్సీ తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. “జనగణమన “(తమిళ ), “శభాష్ మిథు “(హిందీ ) మూవీస్ కు తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























