ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 19
" చావు కబురు చల్లగా " సెట్స్ లో లావణ్య త్రిపాఠి
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
'కమిట్మెంట్' టీజర్ రిలీజ్
షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా

నాగశౌర్య భారీ వర్కౌట్
లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?
కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్
ఖుష్బూకి తృటిలో తప్పిన ప్రమాదం
షూటింగ్ కు సిద్ధం - చిరంజీవి
హీరో విశ్వక్ సేన్ కు జోడీగా నివేత పేతురాజ్
మెగా - మంచు దీపావళి

"రీసౌండ్ " షూటింగ్ పునః ప్రారంభం
క్లైమాక్స్ లో A1ఎక్స్ ప్రెస్
టాలెంట్ తోనే గుర్తింపు - తమన్నా
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. "నవంబర్ స్టోరీ "(తమిళ ), "లెవెన్త్ అవర్ "(తెలుగు ) వెబ్ సిరీస్ లలో తమన్నా నటిస్తున్నారు.
" చావు కబురు చల్లగా " సెట్స్ లో లావణ్య త్రిపాఠి
పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో రూపొందుతున్నస్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హాకీ ప్లేయర్ గా నటిస్తున్న లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. హీరో కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా "మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు.
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
లేడీ సూపర్ స్టార్ నయన తార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు అభిమానులతో పాటు పలువురు సినీ సీలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఈనేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనట్విట్టర్ ద్వారా నయన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. వన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది.
'కమిట్మెంట్' టీజర్ రిలీజ్
హైదరాబాద్ నవాబ్స్ ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపిలేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం కమిట్ మెంట్. లవ్, డ్రీమ్,హోప్, ఫైట్ అనే నాలుగు భిన్నమైన స్టోరీలతో ఈ చిత్రం సాగుతుంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్, ఫూట్ లూస్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై బల్దేవ్సింగ్, నీలిమ. టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీపావళికి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్ను అందించారు.

నాగశౌర్య భారీ వర్కౌట్
యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "#NS 20 " మూవీ రూపొందుతుంది . ఈ మూవీలో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఆపాత్ర కై భారీ వర్కౌట్స్ చేసి 8 ప్యాక్ సాధించారు. తన వర్కౌట్ ఫొటోస్ నాగశౌర్య సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.
లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?
తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు మూవీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. "పడయప్పా "తమిళ మూవీ లో రజనీకాంత్ కు ధీటుగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రమ్యకృష్ణ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్
తెలుగు సినీ పరిశ్రమకు రోజుకు ఎంతో మంది కొత్తవాళ్లు పరిచయమవుతూనే ఉంటారు. రోజుకో కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కానీ ఎంత మంది పరిచయమైనా కానీ కొంతమంది కమెడియన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అంతే. కొన్ని కాంబినేషన్స్ లో వచ్చే కామెడీ స్క్రీన్ పై నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ రావు, బాబు మోహన్, అలీ వీరి కాంబినేషన్స్ ఎప్పుడూ సూపర్ హిట్టే. ఇక వారిలో కోటా-మోహన్ బాబు కాంబినేషన్ లో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాల్లో.. వీరి కామెడీ తెలుగుప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో మాయదారి మోసగాడు సినిమా నుండి కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్ మీకోసం.
‘ఆకాశం నీ హద్దురా' పై విజయ్ ప్రశంసలు - సుధా గారు మీతో వర్క్ చేస్తా
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. lచాలా సినిమాల తర్వాత సూర్య మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.
ఖుష్బూకి తృటిలో తప్పిన ప్రమాదం
సినీ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూకి తృటిలో ప్రమాదం తప్పింది. చెన్నై లోని ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల నిమిత్తం వెళుతుండగా చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ కావడంతో వేరే వాహనంలో ఆమె వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
షూటింగ్ కు సిద్ధం - చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా "ఆచార్య "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
హీరో విశ్వక్ సేన్ కు జోడీగా నివేత పేతురాజ్
టాలెంటెడ్ తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో రామ్ కు జోడీగా నివేత నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
బిగ్ బాస్ 4-కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు
బిగ్ బాస్ 4 - మొన్న రాత్రి ఎపిసోడ్ తో సీరియస్ గా మారిన హౌస్ నిన్న కాస్త కూల్ అయింది. ఎపిసోడ్ స్టార్టింగే అరియానా సోహైల్ మాట్లాడుకుంటారు.. అరియానా ఈసారి ఎవరి కోసం త్యాగం చేయమని అనకండి.. నేను అయితే ఎవరి కోసం చేయను.. 12వ వారం వచ్చేసింది.. సోహెల్ నువ్వు నాకోసం త్యాగం చేస్తావా చెప్పు అంటే చేయను అంటాడు.. నేను నీ కోసం చేస్తానా అంటే నువ్వు అసలే చెయ్యవు అని అనుకుంటారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే"
శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , అందాల త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ ఘనవిజయం సాధించింది. కె విశ్వనాథ్ , కోట శ్రీనివాస రావు , సునీల్ , కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది.
మెగా - మంచు దీపావళి
మెగా ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు చిరు,మోహన్ బాబు సరదాగా కౌంటర్లు వేసుకున్నా రెండు ఫ్యామిలీస్ మధ్య బంధం వేరు. కేవలం ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే కాదులెండి టాలీవుడ్ లో అక్కినేని,మెగా,నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ దాదాపు సన్నిహిత్యంగానే ఉంటాయి. ఇక హీరోస్ మంచు మనోజ్, చరణ్, ఎన్టీఆర్, రానా, మహేష్ వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అందరికీ తెలుసు.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.
రేసుగుర్రం -కిల్‌బిల్‌పాండేగా బ్రహ్మీ కామెడీ పీక్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ కీలక పాత్రలు పోషించారు.

"రీసౌండ్ " షూటింగ్ పునః ప్రారంభం
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ "143 "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నేనింతే ", "బంపర్ ఆఫర్ ", హలో ప్రేమిస్తారా", రోమియో ", నేనో రకం "వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ , రాశీసింగ్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "రీసౌండ్ " మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేసుకుంది.
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి ఫ్యాన్ గా సుధీర్ బాబు
యాక్షన్ ఎంటర్ టైనర్ "V" మూవీ లో కాప్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుధీర్ బాబు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో సుధీర్ బాబు పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. 70ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "పలాస 1978 "మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా "శ్రీదేవి సోడా సెంటర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సుధీర్ బాబు సూరిబాబు క్యారెక్టర్ లో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి ఫ్యాన్ గా నటిస్తున్నారు.
క్లైమాక్స్ లో A1ఎక్స్ ప్రెస్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇటీవలే లావణ్య త్రిపాఠి తన షూటింగ్ ను పూర్తిచేసుకోగా ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.