దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు తెరపై గ్లామర్‌కి కొత్త గ్రామర్ నేర్పిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు. అంతేకాదు… బాక్సాఫీస్కీ కొత్త లెక్కలు నేర్పారాయన. అగ్ర కథానాయకులతోనే కాదు నూతన తారలతో, మీడియం రేంజ్ హీరోల కాంబినేషన్ లోనూ సంచలనాలు సాధించారు ఈ శతాధిక చిత్రాల దర్శక దిగ్గజం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`బాబు` (1975)తో మొదలైన కె.రాఘవేంద్రరావు దర్శకప్రస్థానం `గంగోత్రి` (2003)తో వంద చిత్రాల మైలురాయికి చేరుకుంది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే… అల్లు అర్జున్ లాంటి టాలెంటెడ్ హీరోని తెలుగు తెరకు పరిచయం చేశారు రాఘవేంద్రరావు. అంతేకాదు… ఇదే సినిమాతో ఆ రోజుల్లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న ఆర్తి అగర్వాల్‌కి చెల్లెలు అయిన అదితి అగర్వాల్‌ని కథానాయికగా పరిచయం చేశారు దర్శకేంద్రుడు.
ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే… 2003 మార్చి 28న విడుదలైన గంగోత్రి… నేటితో 17 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే… కథానాయకుడిగా అల్లు అర్జున్ కెరీర్ మొదలై నేటితో 17 సంవత్సరాలు పూర్తవుతోందన్నమాట. ఈ సందర్భంగా… మున్ముందు బన్నీ మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: