మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి అలా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారో లేదో కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత హడావుడి నడుస్తుంది. మన హీరోల్లా ఏదో వాడాంలే.. ఒక ట్వీట్ చేశాం మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా… రోజుకు రెండు మూడు ట్వీట్స్ తో ఫుల్ యాక్టీవ్ లో వుంటున్నారు. దీనికి తోడు కరోనా వల్ల ఇంట్లోనే ఉండటంతో ట్విట్టర్ వేదికగా కామెడీ ట్వీట్స్ తో చిరు కామెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తన స్నేహితుడు మోహన్ బాబు తో కూడా చమత్కరించారు. సోషల్ మీడియా లోకి అడుగుపెట్టినందుకు గానూ అందరు చిరుకి ప్రేమతో ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా వెల్ కమ్ చెప్పాడు. దానికి చిరు థ్యాంక్స్ మిత్రమా.. ‘రాననుకున్నావా.. రాలేననుకున్నావా’ అంటూ ఇంద్ర సినిమాలో డైలాగ్ వేశారు. ఇక దానికి మోహన్ బాబు ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెపుతాలే అని రిప్లై ఇవ్వగా దానికి చిరు కౌంటర్ గా మిత్రమా కౌంటర్ కరోనా రక్కసి కోరలు చాస్తున్న తరుణంలో మనలో మార్పు రావాలి.. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్ అంటూ ట్వీట్ చేశారు. మరి దీనికి మోహన్ బాబు ఏం రిప్లై ఇస్తాడో చూడాలి. మొత్తానికి చిరు, మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ లా చిన్న చిన్న కౌంటర్ లతో నెటిజన్లకు బాగానే టైం పాస్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ee saari Hug chesukunappudu chepputhanu! 😉 https://t.co/05djGo0ZvT
— Mohan Babu M (@themohanbabu) March 26, 2020
మిత్రమా … …కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. NO hugs …NO shake hands …Only Namasthe! Social distancing is must.For more awareness on how to protect our near and dear, watch the video made by our Lakshmi Prasanna @LakshmiManchu #StayHomeStaySafe https://t.co/pmla7FgPhL
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 28, 2020
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: