80లలో దూర దర్శన్ లో ప్రసారమైన “రామాయణ్”, ” మహాభారత్” సీరియల్స్ పేక్షకులను ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. ఇప్పటిలా మల్టీ ప్లెక్స్ లు, ఇంటర్ నెట్, OTT ప్లాట్ ఫారమ్స్ లేని రోజుల్లో 30 సంవత్సరాల క్రితం టీవీ లే ప్రేక్షకులకు వినోద సాధనం. 1987 సంవత్సరంలో దూరదర్శన్ లో “రామాయణ్” సీరియల్ 85 వారాల పాటు ప్రసారం జరిగింది. ఆ సమయంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా టీవీ లకు అతుక్కుపోయేవారు. 1988 సంవత్సరం ” మహాభారత్” సీరియల్ దూర దర్శన్ లో ప్రసారమైంది. రెండు సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కరోనా వైరస్ కారణం గా ఇళ్ళకే పరిమితం అయిన ప్రజల కోరిక పై “రామాయణ్”, ” మహాభారత్” సీరియల్స్ రెండూ ఈ రోజు నుండి పున ప్రసారం అవుతున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దూర దర్శన్ లో ప్రసారమయ్యే “రామాయణ్”, ” మహాభారత్” సీరియల్స్ ను చిన్న వయసులో కుటుంబ సభ్యులతో చూసి ఎంజాయ్ చేసేదానిని అని, ఆ రెండు సీరియల్స్ పున ప్రసారం కావడం సంతోషంగా ఉందని, ఇటువంటి పురాణ కథలతో పిల్లలు ఎంతో నేర్చుకోవచ్చని కాజల్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: