మ‌ళ్ళీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ర‌వితేజ‌?

Mass Maharaja Ravi Teja Once Again To Act In a Periodic Drama Movie

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి `క్రాక్` కాగా.. మ‌రొక‌టి `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఈ రెండు చిత్రాల‌తో పాటు… ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించిన త్రినాథ‌రావు న‌క్కిన‌తో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు ర‌వితేజ‌. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ చిత్రం 80ల నాటి వాతావ‌ర‌ణంతో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఆసక్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఇటీవ‌ల విడుద‌లైన ‘డిస్కోరాజా’లోనూ పీరియాడిక్ ట‌చ్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో క‌నిపించి అల‌రించాడు ర‌వితేజ‌. మ‌రి.. కొత్త చిత్రంలో ఎలాంటి వినోదాలు పంచుతాడో చూడాలి.

కాగా, త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =