కరోనా ఎఫెక్ట్ పలు పరిశ్రమలపై బాగానే పడింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్ బాగా పడింది. హీరోలు, హీరోయిన్స్ ఇంట్లోనే వుండండి… బయట తిరగకండి.. కరోనాను తరిమికొట్టండి అంటూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. వీళ్లకు ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు కాబట్టి ఇంకో రెండు మూడు నెలలు ఇలానే వున్నా వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ సినీ కార్మికులకు మాత్రం ఇది పెద్ద సమస్యనే. షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ కార్మికులకు ఉపాధి కరువయింది. పేద సినీ కార్మికులకు కష్టంగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో పేద సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇవ్వగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ కార్మికుల కోసం తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ‘ప్రస్తుతం లాక్‌డౌన్ అనేది అవసరం. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్‌డౌన్ అవసరం. లాక్‌డౌన్ పాటిస్తున్న వారికి.. మద్దతుగా నిలుస్తున్న వారికి నా అభినందనలు. ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపాడు.
#lockdown is a harsh reality and a necessity!!! Appreciating the response from my colleagues🙏I am Donating an amount of Rs 1 Crore for now as my bit for the well being of daily wages Film workers during this#Coronacrisis. May god bless us!! #StayHomeStaySafe
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 28, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























