యంగ్‌ టైగ‌ర్ య‌న్టీఆర్ ‘ఆది’కి 18 ఏళ్ళు

Young Tiger NTR Blockbuster Movie Aadi Completes 18 Years

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌కు కెరీర్ ఆరంభంలో బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో వి.వి.వినాయ‌క్ ఒక‌రు. అలాంటి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘ఆది’. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో య‌న్టీఆర్ స‌ర‌స‌న కీర్తి చావ్లా హీరోయిన్‌గా న‌టించింది. రాజ‌న్.పి.దేవ్, ‘ఆహుతి’ ప్ర‌సాద్, చ‌ల‌ప‌తిరావు, అలీ, య‌ల్.బి.శ్రీ‌రామ్, యం.ఎస్.నారాయ‌ణ‌, రాజీవ్ క‌న‌కాల‌, వేణు మాధవ్ త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్ర‌బోస్‌, భువ‌న‌చంద్ర‌, పోతుల ర‌వికిర‌ణ్ గీత ర‌చ‌న చేయ‌గా… “మెలోడీ బ్ర‌హ్మ” మ‌ణిశ‌ర్మ బాణీలు అందించారు. “నీ న‌వ్వుల తెల్ల‌ద‌నాన్ని”, “ప‌ట్టు ఒక‌టో సారి”, “చికిచికి బ‌మ్”, “అయ్యో రామ ఆంజ‌నేయ‌”, “సున్నుండ తీసుకో”, “తొలి పిలుపే”… ఇలా ప్ర‌తీ పాట జ‌నాద‌ర‌ణ పొందింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం య‌న్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్టర్ మూవీగా నిలిచింది. 2002 మార్చి 28న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన ‘ఆది’… నేటితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 20 =