లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్

Director Puri Jagannadh Sends Out His Video Message To Public On Lockdown

కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంత మంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా బయట తిరుగుతున్నారు. దానికి పర్యవసానం ప్రజలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని పూరి జగన్నాథ్ కోరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇళ్ళకే పరిమితం అయిన కొంతమంది బోర్ డమ్ ఫీల్ అవుతున్నారని, ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుపుతూ పూరి జగన్నాథ్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. వార్ తరువాత సిరియా దేశపు ప్రజలు తిండి, నీళ్ళు లేక అలమటించారని, 2009 సంవత్సరంలో నైజీరియా టెర్రరిస్టు 300 మంది స్కూలుపిల్లలను కిడ్నాప్ చేసి 10 సంవత్సరాలపాటు బందీలుగా ఉంచాడని, ఆ పిల్లల పరిస్థితి ఊహించుకోండని, నార్త్ సెంటినల్ ఐ ల్యాండ్ లో వ్యాధుల కారణంగా అనేక మంది గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, అలాగే ఎంతో మంది నిరుపేదలు కనీస అవసరాలు లేకుండా ఫ్లై ఓవర్స్ కింద, పేవ్ మెంట్స్ పై బ్రతుకు వెళ్ళదీస్తున్నారని, ఇలా చూసుకుంటే మీ బోర్ డమ్ ఒక లెక్కలోనిది కాదని, లాక్ డౌన్ సమయంలో బయటకు రావద్దని, అన్ని ప్రాబ్లెమ్ లను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండండని పూరి జగన్నాథ్ మెసేజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.