లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుష్పక విమాన, అపూర్వ సహోదరగళ్, ఆదిత్య 369, మేడమ్ వంటి విభిన్న కథా చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ బయోపిక్ మూవీ ని తెలుగు, తమిళ భాషలలో రూపొందించనున్నారు. సింగీతం ప్రస్తుతం ఒక తమిళ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మాన్ 2 ” షూటింగ్ ను సమంత కంప్లీట్ చేసుకున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: