కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఆరంభంలో కమర్షియల్ మూవీస్‌తో ఆకట్టుకున్న ఈ ద్వయం… ఆపై భక్తిరస చిత్రాల బాట పట్టి ప్రేక్షకులను మైమరపించారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘అన్నమయ్య’(1997) వంటి జనరంజక చిత్రం తర్వాత వచ్చిన సినిమా ‘శ్రీరామదాసు’. ఇందులో శ్రీరామచంద్రుని సాక్షాత్కారం కోసం పరితపించిన పరమ భక్తుడు “రామదాసు” పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. నాగ్ కి జంటగా స్నేహ నటించిన ఈ చిత్రంలో సుమన్ శ్రీరాముడి పాత్రలో దర్శనమివ్వగా… అక్కినేని నాగేశ్వరరావు, నాజర్, నాగబాబు, అలీ, వేణుమాధవ్, సునీల్, వేద, సుజాత, సుధ, హేమ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వరవాణి కీరవాణి అందించిన బాణీలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రామదాసు కీర్తనలతో పాటు ఇతర గీతాలు కూడా రంజింపజేశాయి. కొండా కృష్ణంరాజు నిర్మించిన ఈ భక్తిరస చిత్రం… ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (నాగార్జున), ఉత్తమ మేకప్ మ్యాన్ (రామచంద్రరావు) విభాగాలలో “నంది” పురస్కారాలతో పాటు… రెండు ఫిలిమ్ ఫేర్ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. 2006 మార్చి 30న విడుదలై ప్రజాదరణ పొందిన ‘శ్రీరామదాసు’… నేటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























