`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే… నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి చాన్నాళ్ళ క్రితమే బాలయ్య కోసం `రామారావు` అనే టైటిల్‌తో పక్కాగా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడట అనిల్. ఎట్టకేలకు దీనికి బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని సమాచారం. కాకపోతే… బోయపాటి, బి. గోపాల్ సినిమాలు పూర్తయ్యాకే అనిల్ మూవీని పట్టాలెక్కించే దిశగా బాలయ్య ప్లాన్ చేశారట. సో… ఈ ఏడాది ద్వితీయార్థంలో `రామారావు` పట్టాలెక్కే అవకాశముందన్నమాట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి.. ఇదే అనిల్ తదుపరి చిత్రం అవుతుందో లేదంటే ఈలోపే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: