మ‌రోసారి పవన్‌కి జోడీగా కాజల్?

Kajal Aggarwal To Team Up Again With Power Star Pawan Kalyan For Harish Shankar Directorial

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ స‌ర‌స‌న క‌నువిందు చేసిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (2016) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. ప‌వ‌న్, కాజ‌ల్ జంట స‌ద‌రు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత పవన్, కాజల్ మ‌రోసారి కలిసి నటించేందుకు రంగం సిద్ధమవుతోందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. ‘గబ్బర్ సింగ్ (2012) తరువాత పవన్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా కాజల్‌ను ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉందట హ‌రీష్ అండ్ టీమ్. ప్ర‌స్తుతం ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్.. ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. త్వరలోనే కాజల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి, ‘సర్దార్’తో విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన ప‌వ‌న్, కాజ‌ల్ జోడి.. ఈ చిత్రంతోనైనా హిట్ కొడ‌తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =