సినిమాలకు మరోసారి బ్రేక్ వేసిన పవన్…!

Power Star Pawan Kalyan Stops Signing Up New Movies
Power Star Pawan Kalyan Stops Signing Up New Movies

ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ కన్ఫ్యూజన్ లో ఉండగా అభిమానులకు మాములు ఊరట ఇవ్వలేదు పవన్. ఒక్క సినిమాతో కాదు ఏకంగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వీటితో పాటు క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం వేరే సినిమాలకు పవన్ సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. పవన్ సినిమాలు చేయడానికి ఒప్పుకోవడంతో పవన్ తో సినిమాలు చేయాలనుకున్న వాళ్ళందరూ కథలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనను ఒప్పించి సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం లాక్ డౌన్ అని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. నిజానికి ‘వకీల్ సాబ్’ సినిమా మే15 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి అవి మొదలవ్వంటే లేట్ అవుతుంది. మరో పక్క రాజకీయాలు కూడా చూసుకోవాలి. సమాజానికి దగ్గరగా ఉండాలి. కాబట్టి కొత్త సినిమాలు ఒప్పుకొని లాకై పోతే రాజకీయ కార్యక్రమాలు చూసుకోడానికి కుదరదని… వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. మరి చూద్దాం ఆ మూడు సినిమాలు అయిపోతే అప్పుడైనా వేరే సినిమాలను ఒప్పుకుంటారేమో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nine =