సెలెబ్రిటీస్ అంటేనే ఫోకస్ కొంచం ఎక్కువ ఉంటది. అందులో ఏ స్టార్ హీరోనో.. స్టార్ హీరోయినో అయితే ఇంక స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఏం చేసినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు అలాంటిదే ఇక వార్త చక్కర్లు కొడుతుంది. అది కూడా సమంత పై. నిజానికి సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకునేది. అయితే ఇప్పుడు చాలా రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంది సామ్. లాక్ డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఒకటి,రెండు పోస్టులు తప్పా.. ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీనితో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ ఎందుకు సైలెంట్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేనా సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చిందంటే… రూమర్లు వచేస్తుంటాయి కదా అలానే… సమంతపై కూడా పలు వార్తలు వస్తున్నాయి. సమంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుందని… అబ్బో ఇలా ఎన్నో కథనాలు వడ్డించేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ లాక్ డౌన్ సమయంలో తను తన పూర్తి సమయాన్ని భర్త నాగ చైతన్యతో గడపాలనే ఇలాంటి వాటికి దూరంగా ఉందని..మళ్ళీ లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాలతో…కలిసి ఉండే టైమ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే సామ్ ఈ టైం పూర్తిగా పర్సనల్ గా గడపాలని అనుకుంటుందట. మరి తాను తల్లి కావాలనుకున్నపుడు అవుతాను.. దానికి ఏ కారణం అవసరం కూడా లేదు.. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పేరెంట్స్ అవుతామని సమాధానమిచ్చింది సామ్. మరి నెటిజన్లు ఇప్పటికైనా తమ సొంత కథనాలకు బ్రేక్ వేస్తారేమో…




ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























