టాలీవుడ్ సూపర్ స్టార్‌తో శాండ‌ల్‌వుడ్ సూప‌ర్ స్టార్?

Sandalwood Star Upendra To Play A Pivotal Role In Super Star Mahesh Babu Movie

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు జి. మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, కొర‌టాల శివ హోమ్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళ్తే.. మ‌హేష్, ప‌ర‌శురామ్ కాంబోలో రాబోతున్న చిత్రం ఓ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్క‌నుంది. కాగా, ఇందులో క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర కోసం విల‌క్ష‌ణ న‌టుడు ఉపేంద్రని ఎంపిక చేసారని సమాచారం. వాస్త‌వానికి మహేష్ గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లోనే ఉపేంద్ర న‌టించ‌నున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే, అది కార్య‌రూపం దాల్చ‌లేదు. మ‌రి, ఈ సారైనా ఈ శాండల్‌వుడ్ సూప‌ర్ స్టార్.. మహేష్ సినిమాలో కనిపిస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.