వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరూ పోలీసులకు మద్దతుగా ఉంటారని విజయ్ చెప్పాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోను డీజీపీ తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… పోలీసులకు ఉత్సాహానిచ్చేలా సందేశం ఇచ్చిన విజయ్‌కి డీజీపీ మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rowdy @TheDeverakonda appreciates the police department for their brilliant services during this tough time 👏👏#VijayDeverakonda #Lockdown #IndiaFightsCorona pic.twitter.com/VeCd6enOBa
— Telugu FilmNagar (@telugufilmnagar) April 11, 2020
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: