స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో “పుష్ప “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఒక కొత్త గెటప్ లో, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోరూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పంద లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప “మూవీ లో విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఎంపిక అయ్యారని సమాచారం. సక్సెస్ ఫుల్ “బల్వాన్ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన సునీల్ శెట్టి రెండున్నర దశాబ్దాలుగా సుమారు 125 మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. సునీల్ శెట్టి ప్రస్తుతం దక్షిణాది మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి నటించిన ” దర్బార్ ” తమిళ, “పహిల్వాన్ “కన్నడ మూవీస్ రిలీజ్ అయ్యాయి. మలయాళం లో నటించిన “మరక్కార్ ” విడుదలకు సిద్ధంగా ఉంది. హాలీవుడ్ క్రాస్ ఓవర్ “మోసగాళ్ళు ” మూవీ లో సునీల్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























