మంచు విష్ణు కెరీర్లో తొలి విజయవంతమైన చిత్రంగానూ, కెరీర్ బెస్ట్ ఫిల్మ్గానూ నిలిచిన సినిమా ‘ఢీ’. వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రంలో విష్ణుకు జోడిగా జెనీలియా నటించింది. శ్రీహరి, ప్రేమ, చంద్రమోహన్, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మానందం, సునీల్, శ్రీనివాస రెడ్డి, ఆకాష్, సుప్రీత్, జయప్రకాష్ రెడ్డి, మాస్టర్ భరత్, ‘చిత్రం’ శ్రీను ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, సాహితి, కందికొండ, చిన్ని చరణ్ సాహిత్యం సమకూర్చగా.. చక్రి బాణీలు అందించారు. వీటిలో “కనుపాపకు ఇది తెలుసా”, “కొంచెం కొంచెం” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని తమిళం (‘మిరట్టల్’), బెంగాలీ (‘ఖోకాబాబు’) ఒడియా(‘తు మో గర్ల్ ఫ్రెండ్’) భాషల్లోనూ పునర్నిర్మించారు. 2007 ఏప్రిల్ 13న విడుదలైన ‘ఢీ’.. నేటితో 13 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: