హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “ఎన్టీఆర్ 30” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రారంభం అయ్యే ఈ మూవీ లో ఒక యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు త్రివిక్రమ్ తాను దర్శకత్వం వహించే మూవీస్ లో యువ కథానాయకులకు కూడా అవకాశం ఇస్తారని తెలిసిన విషయమే. “అజ్ఞాతవాసి” మూవీ లో ఆది పినిశెట్టి, “అరవింద సమేత వీర రాఘవ “లో నవీన్ చంద్ర, “అల .. వైకుంఠపురములో .. మూవీ లో సుశాంత్ నటించారు. తన మూవీ లో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే త్రివిక్రమ్ “ఎన్టీఆర్ 30” మూవీ లో కూడా ఒక యువ కథానాయకుడి కి అవకాశం కల్పించనున్నారని సమాచారం. ఈ మూవీ కి “అయిననూ పోవలె హస్తినకు ” టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































