నా మనవరాలు కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తోంది..!

ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ .. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అందుకు కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను” అని చిరు నిన్న తన ట్విట్టర్ ద్వారా సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట ఏంటో చెప్పేశారు మెగా స్టార్. తన మనవరాలితో ఖైదీ నెం 150 సినిమాలోని పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ‘మ్యూజిక్ కు ఉన్న పవర్ ను చూసి నేను ఎప్పుడూ అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటానని చిరంజీవి అన్నారు. ఒక ఏడాది వయసున్న తన మనవరాలు కూడా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోందని చెప్పారు. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ పాట తనదే కాబట్టి… అమ్మమ్మ సురేఖ వద్ద క్రెడిట్ అంతా తనకేనని చమత్కరించారు. ఇక చిరు తన మనవరాలితో కలిసి చేస్తున్న అల్లరి చూడటానికి బలే ఉంది. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో చిరు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.