సమంత.. ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న కథానాయిక. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తెలుగునాట పదేళ్ళకు పైగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ చెన్నై చిన్నది. కెరీర్ ఆరంభంలో రొమాంటిక్, గ్లామర్ పాత్రలతో యువతను తన వైపు తిప్పుకున్న సామ్.. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌తోనూ, నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



‘ఏ మాయ చేసావె’, ‘బృందావనం’, ‘దూకుడు’ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్‌ను చవిచూసిన వైనం సామ్ సొంతం. అంతేకాదు.. ‘మనం’, ‘అఆ’, ‘రంగస్థలం’, ‘మజిలీ’ వంటి మూవీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన సామ్.. ‘రాజుగారిగది 2’, ‘మహానటి’(కీలక పాత్ర), ‘యూటర్న్’, ‘ఓ! బేబీ’, ‘జాను’ వంటి నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. అదే విధంగా.. తెలుగునాట పలువురు కథానాయకుల కెరీర్ బెస్ట్ మూవీస్‌లోనూ భాగమైన సామ్.. వరుస విజయాలతో అనతి కాలంలోనే అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. అలాగే, పలు అవార్డులను తన కిట్టీలో వేసుకుంది.
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. మున్ముందు కూడా ఇదే శైలిని కొనసాగించాలని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది `ది తెలుగుఫిల్మ్‌నగర్.కామ్`.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























