ప్రభాస్ అనే పేరు మర్చిపోయి.. బాహుబలి అని పేరును సంపాదించుకున్నాడంటే ప్రభాస్ దానికి కారణం ‘బాహుబలి’ సినిమా అని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈసినిమా వచ్చిన అవార్డుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏప్రిల్ 28, 2017న విడుదలైన బాహుబలి 2 చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. బాహుబలి 2 దేశం ప్రేమించిన చిత్రం మాత్రమే కాదు, నా జీవితంలో అతిపెద్ద చిత్రం కూడా. నా జీవితంలో మరచిపోలేని చిత్రంగా చేసిన నా అభిమానులు, బృందం మరియు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. బాహుబలి 2 మూడేళ్ళు పూర్తి చేసుకుంది . మీరు చూపించే ప్రేమని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని పేర్కొన్నారు ప్రభాస్.
ఇక ఈ సినిమాలో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ది మైటీ, ది మెజిస్టీ.. ది మాహిష్మతీ.. మీ ప్రేమలని మిస్ అవుతున్నా అని తన ట్వీట్లో తెలిపాడు.
The Might, The Majesty,
The Mahishmathi!! Miss all of you loads. ❤️❤️❤️#3YrsOfMightyBaahubali2 https://t.co/6Pjy7l34EV— Rana Daggubati (@RanaDaggubati) April 28, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: