ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’కి 3 ఏళ్ళు

Tollywood Jakkanna SS Rajamouli Magnum Opus Bahubali 2 The Conclusion Completes 3 Years.

భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్‌కి ఊపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఆ సిరీస్‌లో రెండో చిత్రంగా వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛత్రపతి’ ‘బాహుబలి: ది బిగినింగ్’ వంటి ఘనవిజయాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వారిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలవడమే కాకుండా ఇండియన్ హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ జానపద చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, దగ్గుబాటి రానా, నాజర్, సత్యరాజ్, అడివి శేష్, సుబ్బరాజు ముఖ్య భూమికలు పోషించారు.

కీరవాణి, శివశక్తి దత్త, కె.రామకృష్ణ, చైతన్యప్రసాద్ సాహిత్యం సమకూర్చగా స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. “ఓరోరి రాజా”, “సాహోరే బాహుబలి”, “కన్నా నిదురించరా”, “దండాలయ్యా”, “ఒక ప్రాణం”.. ఇలా ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ విజువల్ వండర్.. పలు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. 2017 ఏప్రిల్ 28న రిలీజై ఇండియన్ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’.. నేటితో మూడేళ్ళను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + ten =