బాలీవుడ్ కి ‘ఇస్మార్ట్ శంకర్’.. క్లాస్ హీరో..!

Ranbir Kapoor To Play The Lead Role In Ismart Shankar Hindi Remake
Ranbir Kapoor To Play The Lead Role In Ismart Shankar Hindi Remake

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ గత ఏడాది జులై నెలలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను ఇప్పటికే తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలిసిందే. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇస్మార్ట్ శంకర్ తమిళ రీమేక్ మూవీ లో హీరోగా నటిస్తారని సమాచారం. ధనుష్ ఇప్పటికే చాలా సినిమాల్లో మాస్ క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా చేయడం పెద్ద కష్టమేం కాదు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా చాక్లెట్ బాయ్ ర‌ణ‌బీర్ తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇక్కడే అసలు సమస్య. పక్కా మాస్ క్యారెక్టర్ అంటే రణబీర్ కు సెట్ అవుతుందా అని. కెరీర్లో ఇప్ప‌టిదాకా ఒక్క మాస్ సినిమా కూడా చేయలేదు. ఒకవేళ చేసినా ఎలా ఉంటుందో అన్నది పాయింట్. మరి దర్శక నిర్మాతలు తమ ఒపీనియన్ ను మార్చుకుంటారా? లేక రణబీర్ తోనే సినిమా చేస్తారా అన్నది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =