కార్తి, త‌మ‌న్నా ‘ఆవారా’కి 10 ఏళ్ళు

Karthi and Tamannaah Musical Blockbuster Movie Awaara Completes 10 Years

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన పలు తమిళ సినిమాలు అనువాద రూపంలో తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాటిలో ‘ఆవారా’(తమిళంలో ‘పయ్యా’) ఒకటి. ఇందులో కార్తికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. యన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోనియా దీప్తి, మిలింద్ సోమన్, జగన్, అర్పిత్, జస్పేర్, రామచంద్రన్ దురైరాజ్, దర్శన్ జరీవాలా ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా వీనులవిందైన బాణీలు అందించగా.. చంద్రబోస్, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చారు. “చిరు చిరు చిరు చినుకై”, “నీ ఎదలో నాకు చోటు వద్దూ”, ‘అరెరే వాన”, “మందార పూవల్లె”, “చుట్టేసి చుట్టేసి”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. తిరుపతి బ్రదర్స్ పతాకంపై యన్.సుభాష్ చంద్రబోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2010 మే 21న విడుదలైన ‘ఆవారా’.. నేటితో 10 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 9 =