మణిరత్నం సినిమాలో నటించట్లేదు.. !

Bollywood Actress Aditi Rao Hydari Says That She Is Not A Part Of Mani Ratnam Ponniyin Selvan Movie
Bollywood Actress Aditi Rao Hydari Says That She Is Not A Part Of Mani Ratnam Ponniyin Selvan Movie

సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మణిరత్నం పోన్నియన్ సెల్వన్ అనే పీరియాడికల్ డ్రామాతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అదితీరావు హైదరీని తీసుకున్నట్లు గత కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. అయితే మణిరత్నం సినిమాలో చిన్న పాత్ర వచ్చిన తాను చేయడానికి సిద్ధం అని కూడా చెప్పింది. మరి చూద్దాం మణిరత్నం ఏమైనా పాత్రలో ఛాన్స్ ఇస్తాడేమో. కాగా గతంలో మణిరత్నం దర్శకత్వంలో కార్తికి జోడీగా చెలియా అనే సినిమాలో నటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eight =