ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చినట్టేనా..!

KGF Director Prashanth Neel Gives Hint To Audience With His Birthday Wish
KGF Director Prashanth Neel Gives Hint To Audience With His Birthday Wish

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇక సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ తో ఈ సినిమా హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ నీల్ కూడా తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. `ఓ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఎట్టకేలకు నేను తెలుసుకున్నాను. మళ్లీ కలిసేటపుడు చుట్టూ ఉన్న ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి రేడియేషన్ సూట్ తెచ్చుకుంటాను. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ తారక్. త్వరలోనే కలుద్దాం` అంటూ ప్రశాంత్ ట్వీట్ చేశాడు. దీనితో వీరిద్దరి సినిమా ఉండబోతుందని ఫిక్స్ అయిపోతున్నారు. ఇక అధికారిక ప్రకటన ఇవ్వడం ఒక్కటే తరువాయి భాగం అని అంటున్నారు. మరి వీటన్నిటిపై క్లారిటీ రావాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =