OFFICIAL! రానా -మిహికా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

Tollywood Actor Rana Daggubati Gets Engaged To Miheeka Bajaj At Ramanaidu Studios In Hyderabad

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి మొత్తానికి ఒక ఇంటివాడవ్వబోతున్నాడు. ఇటీవల తన ప్రేమను మిహికా బజాజ్ ఒప్పుకుందని హీరో రానా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్‌ కల్లా పెళ్లి చేసేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే స్పష్టం చేశారు కూడా. అయితే నిన్న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక నిర్వహించినట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. లాక్‌డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు సురేష్ బాబు కూడా ఎంగేజ్ మెంట్ కాదు కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ రూమర్లకు ఎలాంటి స్పేస్ ఇవ్వకుండా బ్రేక్ చెప్పేసాడు రానా. తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను రానా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అండ్ ఇట్స్ అఫిషియల్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా కానిచ్చేసినట్టు తెలుస్తుంది. నిన్న రామానాయుడు స్టూడియోలో కేవలం రానా, మిహికా కుటుంబ సభ్యుల సమక్షంలో రానా, మిహీకా నిశ్చితార్థం జరిగింది. ఏదిఏమైనా సాంప్రదాయ వస్త్రధారణలో రానా, మిహికా చూడముచ్చటగా ఉన్నారు.

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 11 =