ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 112

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు - చిరంజీవి
సమంత వెజిటబుల్ గార్డెన్

విజయ్ దేవరకొండ "మిడిల్ క్లాస్ ఫండ్ "
పూజాహెగ్డే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వీడియో
రిలాక్స్ మూడ్ లో తమన్నా
ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!
పవన్ 'వకీల్ సాబ్' షూటింగ్ అప్ డేట్..!

'కార్తికేయ2' లో నిఖిల్ పాత్రను రివీల్..!

'అలివేలుమంగ' గా గోపీచంద్ తో మరోసారి..?

కార్తికేయ కు చిరంజీవి అభినందనలు

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్

వలస కార్మికుల కోసం నిధి అగర్వాల్
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!
కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో లాగ షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పరిస్థితులను అర్థంచేసుకోవాలని అన్నారు మణిరత్నం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. మరి ఇప్పటికే కొంతమంది హీరోలు…

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు - చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రజలకు , ముఖ్యమంత్రి KCR కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి KCR ను చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపోజల్స్ కు ముఖ్యమంత్రి KCR సానుకూలంగా స్పందించారు.
సమంత వెజిటబుల్ గార్డెన్
10 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2"వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో సమంత ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో కొంతకాలం గా అభిమానులకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా మారి తన పెట్ తో ఉన్న ఫోటోలు, నాగచైతన్య తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్నారు.

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పై నాగ్ కాన్ఫిడెన్స్..!
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు.

ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్ స్టా గ్రామ్ కు రీఎంట్రీ
"ఒరు అదార్ లవ్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ మూవీలోని ఒక సాంగ్ లో కన్ను గీటే సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 7 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రియా ప్రకాష్ కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ వైదొలగిన కారణాన్ని ఒక వీడియో ద్వారా తెలిపారు.

విజయ్ దేవరకొండ "మిడిల్ క్లాస్ ఫండ్ "
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాల సహాయార్థం హీరో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాను 25 లక్షలతో ఫండ్ ఏర్పాటు చేసి ప్రజలనుండి డొనేషన్స్ కలెక్ట్ చేసి నెల రోజులలో దాదాపు 17 వేల కుటుంబాలకు విజయ్ సహాయం చేశారు. విజయ్ చేసిన ఈ మంచి పనికి ప్రజల అభినందనలు అందుకున్నారు.

కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' ను ప్రశంసిస్తూ ఎన్టీఆర్ లేఖ
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా... తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రం, జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
పూజాహెగ్డే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వీడియో
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకున్న పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "వరల్డ్ ఫేమస్ లవర్ ", "Prabhas 20" మూవీస్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే టైమ్ పాస్ చేస్తున్నారు.
ప్రభాస్ సినిమాకు 'దీపికా' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే..!
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రోజుకో వార్త తెరపైకి వస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా నటించే అవకాశం ఉందని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికితోడు నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ తప్పక చూడండి అని కూడా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టయింది.
రిలాక్స్ మూడ్ లో తమన్నా
ప్రజల దైనందిక జీవితంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు పలు కష్టనష్టా లకు గురిఅయ్యారు. లాక్ డౌన్ సమయంలో మూవీ షూటింగ్స్ నిలిచిపోయి , షూటింగ్స్ , ఓపెనింగ్స్, ఫోటో షూట్స్ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉండే సినీ సెలబ్రిటీస్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఇక ఈ లాక్ డౌన్ వల్ల బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన కాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది వంటలతో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొంతమంది కొత్త కొత్త విషయాలు నేర్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా పలు కొత్త విషయాలు నేర్చుకుందట.
పవన్ 'వకీల్ సాబ్' షూటింగ్ అప్ డేట్..!
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఈపాటికి థియేటర్ లో రిలీజ్ అయి రెండు వారలు అయిపోయివుండేది. తన అభిమాన హీరోని ఎప్పుడు వెండితెరపై మళ్ళీ చూసుకుందామా అన్న అభిమానుల కోరిక కూడా తీరేది. కానీ కరోనా దెబ్బకి సీన్ మొత్తం రివర్స్ అయింది. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక అన్ని సినిమాల్లాగానే వకీల్ సాబ్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడింది.

'కార్తికేయ2' లో నిఖిల్ పాత్రను రివీల్..!
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు.

'అలివేలుమంగ' గా గోపీచంద్ తో మరోసారి..?
సీత సినిమా తర్వాత తేజ రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.
'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్
అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ సినిమా టైటిల్ ను, ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రాక రాక తమ హీరో సినిమా అప్ డేట్ వచ్చింది..మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా. ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ ప్లస్ మాస్ లుక్ లో వుండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో సోషల్ లైక్ లు, షేర్ లతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అంతేకాదు మరో రికార్డు ను కూడా సొంతం చేసుకుంది. 24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ ఇదే, అలాగే మోస్ట్ లైక్స్…

కార్తికేయ కు చిరంజీవి అభినందనలు
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ మూవీస్ జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్న హీరోల్లో ఒకరు. లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి కార్తికేయ సిక్స్ ప్యాక్ అబ్స్ ను సాధించారు. హీరో నాని "గ్యాంగ్ లీడర్ " మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన కార్తికేయ , ప్రముఖ హీరోతో రూపొందుతున్న తమిళ మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ వర్క్ అవుట్స్, ఫోటో షూట్స్ , ఫుడ్ , మూవీ విశేషాలు వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా కారణం గా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన రకుల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పి ఎమ్ కేర్స్ ఫండ్ కు డైవర్ట్ చేస్తున్నారు.

వలస కార్మికుల కోసం నిధి అగర్వాల్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ, జయం రవి హీరోగా రూపొందుతున్న "భూమి " తమిళ మూవీ లో నటిస్తున్నారు. "భూమి " తమిళ మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.