ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!

Tollywood Star Heroine Kajal Aggarwal Devotes Her Lockdown Time To Gain Expertise In Chess Game
Tollywood Star Heroine Kajal Aggarwal Devotes Her Lockdown Time To Gain Expertise In Chess Game

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఇక ఈ లాక్ డౌన్ వల్ల బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన కాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది వంటలతో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొంతమంది కొత్త కొత్త విషయాలు నేర్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా పలు కొత్త విషయాలు నేర్చుకుందట.

ఇప్పటికే ఈ అమ్మడు పలు వంటలు చేస్తూ ఆ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అయితే ఈ టైంలోనే చెస్ కూడా నేర్చుకుందట. “ఇంతకుముందు చెస్ ఆట గురించి కొద్దిగా తెలుసు కానీ, పూర్తిగా తెలియదు. అందుకే, ఈ ఆట నేర్చుకోవాలని నిర్ణయించుకుని ఆన్ లైన్ లో నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ ఆటలో మెళకువలు బాగా తెలిశాయి… ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో తెలిసింది.ఈ చెస్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే, దీని మీద దృష్టి పెట్టాను’ అని చెప్పింది. అంతేకాదు.. మా అమ్మ దగ్గర పురాణాలకు సంబంధించిన కథలు ఎన్నో తెలుసుకున్నాను…భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను నేర్చుకుంటున్నాను అని కూడా ఈ చందమామ చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్ డౌన్ లో కాజల్ లో బాగానే ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం కాజల్ పలు సినిమాలతో బిజీ గా వుంది. ఆమె‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here