పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ అప్ డేట్..!

Powerstar Pawan Kalyan Vakeel Saab Movie Latest Update
Powerstar Pawan Kalyan Vakeel Saab Movie Latest Update

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఈపాటికి థియేటర్ లో రిలీజ్ అయి రెండు వారలు అయిపోయివుండేది. తన అభిమాన హీరోని ఎప్పుడు వెండితెరపై మళ్ళీ చూసుకుందామా అన్న అభిమానుల కోరిక కూడా తీరేది. కానీ కరోనా దెబ్బకి సీన్ మొత్తం రివర్స్ అయింది. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక అన్ని సినిమాల్లాగానే వకీల్ సాబ్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం… ఈ నెలలో తిరిగి షూటింగ్ ను స్టార్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఎలాగూ ఈ నెల నుండి ప్రభుత్వ నిబంధనలతో షూటింగ్ ను జరుపుకోడానికి అనుమతులు ఉన్నాయి కాబట్టి మిగిలి షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. దాదాపు ఇంకా 35 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అందులో 20 రోజులు పవన్ ఒక్కడిపైనే సన్నివేశాలు ఉన్నాయట. మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ నెలలో షూటింగ్ మొదలుపెడతారేమో చూద్దాం.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + fifteen =