నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో అఖిల్ పాత్రను రివీల్ చేశారు చిత్రయునిట్. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి – వైద్యుడే నారాయణుడు – నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..! ఐతే ఇదే పోస్టర్‌తో కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం.
కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మరి చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: