అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా అవుట్ ఫుట్ పై నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నాడట. లాక్ డౌన్‌తో వచ్చిన ఖాళీ సమయంలో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని చూశాడట. ఇక సినిమా అవుట్ ఫుట్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారట.ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని గట్టినమ్మకంతో ఉన్నాడట. అయితే అక్కడక్కడా కొన్ని మార్పులు చెప్పారంట. మరి చూద్దాం నాగార్జున నమ్మకం ఎంత వరకూ ఫలిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: