ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!

I am Not A Part Of Jersey Movie Hindi Remake Says Actress Rashmika Mandanna
I am Not A Part Of Jersey Movie Hindi Remake Says Actress Rashmika Mandanna

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై రష్మిక స్పందిస్తూ, తాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లోతైన ఎమోషన్స్ ని కలిగి ఉందని… ఆ పాత్రను నేను చేయలేనని తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్నా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కూడా మరో కారణమని చెప్పారు. మరి నిజంగానే జెర్సీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటన కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ రీమేక్ ను తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =