తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా… తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రం, జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. హాలివుడ్ స్థాయిలో తీసిన ఈ చిత్రం ట్రెజర్ హంట్ పేరుతో విదేశీ భాషలకు అను వాదమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు మోసగాళ్లకు మోసగాడు చిత్రం 56 దేశాల్లో విడుదల అయ్యి రికార్డు సాధించింది. అప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అంత పెద్ద స్థాయిలో విడుదల అయ్యింది లేదు. హాలీవుడ్‌లో డబ్బింగ్ అయిన మొదటి ఇండియన్ సినిమాగా కూడా మోసగాళ్లకు మోసగాడు చిత్రం నిలిచింది.
ఇక అప్పట్లో ఈ సినిమాపై ఎన్టీఆర్ కూడా కృష్ణ ను ప్రశంసిస్తూ ఒక లేఖ కూడా రాశారు. నిజానికి అప్పటికే వీరిద్దరి మధ్య పోటీ వాతారణం ఉండేది. అయినా కూడా ఈ సినిమాపై ఎన్టీఆర్ కృష్ణ తో పాటు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి పనితనాన్ని మెచ్చుకుంటూ లేఖ రాశారు. ” సోదరుడు శ్రీకృష్ణ తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చూశాను.. ఎంతో ప్రయాసకు లోనై విశిష్టమైన సాంకేతిక విలువతో, ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం, పట్టుదల ప్రతి షాటులోనూ, ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది . ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రాహణము.. ఇంత మామోజ్ఞంగా ఉన్నత ప్రమాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు.. కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం నిర్వహించిన శ్రీదాసు ప్రశంసాపాత్రుడు. ఇంత సాంకేతిక విలువలతో జాతీయత.. మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావ పూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీకృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన యీ చిత్ర నిర్మాణ కృషికి అతన్ని అభినందిస్తున్నాను.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: