‘అలివేలుమంగ’ గా గోపీచంద్ తో మరోసారి..?

Actress Anushka Shetty To Pair Up Once Again With Gopichand In Teja Alimelu Manga Venkataramana

సీత సినిమా తర్వాత తేజ రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ లో అలివేలు పాత్రలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే పలు హీరోయిన్ ల పేర్లు బయటకి వచ్చాయి. ఇటీవలే మళ్ళీ ఆ పాత్రలో కాజల్ నే తీసుకోవాలని చూస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క. అనుష్కను కూడా ఈ సినిమాలో తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. మరి ఇంత బిజీలో కాజల్ డేట్స్ ఇవ్వడం కష్టమే అంటున్నారు. అందుకే అనుష్క ను తీసుకోవాలని చూస్తున్నారట. చూద్దాం మరి ఫైనల్ గా అలివేలు పాత్ర ఎవరికి దక్కుతుందో.

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత సీత సినిమాను తీసినా అది పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. మరి చూద్దాం ఈ రెండు సినిమాలతో మళ్ళీ హిట్ కొడతాడేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =