‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. గత ఏడాది పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘హీరో’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాను తెలుగులో హీరో పేరుతో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా శివకార్తికేయ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనిరుధ్ హీరోగా ఎప్పుడు చేసిన తన మొదటి సినిమాకు తానే నిర్మించాలనుకుంటున్నానని తెలిపాడు. ఇక ఈ కామెంట్ కు అటు శివ కార్తికేయ, అనిరుధ్ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా లైక్ లు కొడుతున్నారు. మరి ప్రస్తుతం అనిరుధ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. మరి హీరోగా ఎప్పుడు నటిస్తాడో చూద్దాం.
ప్రస్తుతం కార్తికేయ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ‘డాక్టర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాను శివకార్తికేయన్, కేజేఆర్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనితో పాటు రవికుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: