తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా లాక్ డౌన్ సమయం లో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. తమన్నా రీసెంట్ గా హలో యాప్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా హీరోలు మెగా స్టార్ చిరంజీవి తో “సైరా నరసింహారెడ్డి “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కెమెరా మెన్ గంగ తో రాంబాబు “, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “రచ్చ ” మూవీస్ లో తమన్నా నటించిన విషయం తెలిసిందే. తమన్నా మాట్లాడుతూ .. “కెమెరా మెన్ గంగ తో రాంబాబు “మూవీ తనకు ఇష్టమైన మూవీ అని , పవన్ కళ్యాణ్ దమ్మున్న నటుడని , ఆయనతో పనిచేసినప్పుడు ఆయన స్వభావం చూసి చాల ఆనందపడ్డానని, సెట్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో పవన్ కళ్యాణ్ తో పనిచేయడం మెమొరబుల్ అన్నారు. మెగా ఫ్యామిలీ హీరోస్ చిరంజీవి , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో స్క్రీన్ పంచుకొనడం తన అదృష్టమని , మెగా హీరోలు మంచి వ్యక్తులని , వెరీ ట్యాలెంటెడ్ అని , వారితో వర్క్ చేసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని , తనను వారి కుటుంబ సభ్యురాలిగా ట్రీట్ చేస్తారని మెగా హీరోలపై తమన్నా ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























