
రాజమౌళి ట్రయిల్ షూట్ చేస్తున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఓకే.. ఎలాంటి సమస్యా లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అందరు. ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేసుకోవచ్చనేది ఇండస్ట్రీ పెద్దల ఆలోచన.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ట్రయల్ షూట్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ రోజు మరియు రేపు గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుంది. ఈ ట్రయల్ షూట్ కోసం మొత్తం 50 మంది సిబ్బందిని మాత్రమే తీసుకున్నాడట. అయితే ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డూప్ లతో షూట్ ప్లాన్ చేసాడట. ఒకవేళ ఈ ట్రయిల్ షూట్ సక్సెస్ అయితే అప్పుడు హీరోలతో షూటింగ్ ను కంటిన్యూ చేయాలనేది జక్కన్న ప్లాన్. చూద్దాం మరి జక్కన ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో.



లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ లు కూడా మొదలవనున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: