బాల చందర్ గురించి కమల్ – కారు కొనిస్తా అని ఎన్నో ఏళ్లు బతిమిలాడుకున్న..!

I Pleaded Him Several Times About Buying A Car For Him Says Veteran Actor Kamal Haasan About His Mentor K Balachander
I Pleaded Him Several Times About Buying A Car For Him Says Veteran Actor Kamal Haasan About His Mentor K Balachander

ఎంత ఎదిగినా కొంతమంది మాత్రం సింపుల్ గా జీవించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకు తెలిసిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఇప్పటికీ అలాంటి లైఫ్ నే కోరుకుంటారు. ఇక తన గాడ్ ఫాదర్, గురువు బాలచందర్ కూడా అంతే అంటున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. తాజాగా ఏ.ఆర్ రెహ్మాన్ తో ముచ్చటించిన ఆయన తన గురువు గారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆఖరి క్షణం వరకూ తాను చాలా సింపుల్ గానే జీవించారని.. అంతేకాదు తనకు ఒక కారు కొనిస్తానని ఎన్నో ఏళ్ళు బతిమాలానని.. కానీ ఎప్పుడూ ఒప్పుకోలేదని అన్నారు. తాను మాత్రం ఒక ఆటో కొనుక్కొని ఎక్కడికి వెళ్లాలన్నా అందులోనే వెళ్లేవారని.. అంత సింపుల్ గా ఉండేవారని తనని కోల్పోవడాన్ని ఇప్పటికీ భరించలేకపోతున్నా అని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు కె.బాలచందర్. అంతేకాదు రజనీ కాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటులను సైతం సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.

ఇక ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ భారతీయుడు2’ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్‌, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల బ్రేక్ తీసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =