భారీ కుటుంబ కథా చిత్రంతో కలెక్షన్ కింగ్..!

Dialogue King Mohan Babu Plans A Massive Family Entertainer Movie With Ensemble Star Cast

ఒకప్పుడు హీరో హీరోయిన్స్ గా వెండితెరపై ఎన్నో సూపర్ హిట్స్ కొట్టి ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడుకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే సూర్య సినిమా సూరారై పొట్రు తెలుగులో ఆకాశమే నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో పాటు మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగులో మహానటి సినిమాలో తప్ప ఇంతవరకూ మరే సినిమాలో కనిపించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగు సినిమాల గురించి మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… గత కొన్నేళ్లలో తనను కొందరు తెలుగు దర్శకులు కొన్ని పాత్రల కోసం అడిగారని.. కానీ తాను చేయలేదని చెప్పారు. తాను కావాలనే గ్యాప్ తీసుకున్నానని, మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెడితే 365 రోజులూ పని చేస్తానని ఆయనన్నారు. ప్రస్తుతం ‘పెదరాయుడు’ తరహాలో ఒక భారీ కుటుంబ కథా చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలనుకుంటున్నామని.. అందుకోసం కథ కూడా తయారైందని.. ఆ చిత్రంలో చాలా మంది నటీనటులుంటారని.. ఆ సినిమా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు మోహన్ బాబు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =