మనకు ‘సమంత’.. వాళ్లకు ‘యశోద’

Tollywood Star Actress Samantha Akkineni Is Also Known By Another Name Yashoda
Tollywood Star Actress Samantha Akkineni Is Also Known By Another Name Yashoda

సౌత్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కూడా లేకపోవడం ఇంట్లోనే చైతుతో కలిసి టైంను స్పెండ్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సమంత గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు మనం సామ్ అనో సమంత అనో.. అక్కినేని కోడలు అనో ఇలా పలు పేర్లతో పిలుచుకున్నాం. అయితే తనకు ఇంకో పేరు కూడా ఉందట. తాజా సమాచారం ప్రకారం సమంత ఇంట్లో, తన సర్కిల్ ల్లో మాత్రం సమంత ను యశోద అని పిలుస్తారట. అంతేకాదు సామ్ కు యశోద అన్నపేరుతో పిలిస్తే చాలా ఇష్టమట. మరి దీనిపై సామ్ ఎలా స్పందిస్తుందో.. మరి సమంత అయినా.. యశోద అయినా పేరుతో పనిలేదు కదా. టాలెంట్ ఉంటే పేరు ఏదైనా పర్లేదు.

పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. గత ఏడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా,ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ఆ తర్వాత వచ్చిన తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటించింది. అయితే ఈ సినిమా పెద్ద విజయం దక్కించుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =