మళ్లీ బాక్సింగ్ మోడ్ లోకి వరుణ్..!

Gaddalakonda Ganesh Actor Varun Tej Gets In To Boxing Mode

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అంతేకాదు లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇక ఈ టైములో అందరు సెలెబ్రిటీస్ ఇంట్లోనే వర్క్ అవుట్ లు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ టైం పాస్ చేసేవాడు. అయితే మొదట్లో కాస్త రెగ్యులర్ గా చేసినా.. రాను రాను తగ్గించాడట. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ లు మొదలు పెడుతుండటంతో మళ్లీ బాక్సింగ్ మోడ్ లోకి వచ్చేసాడట. షూటింగ్ మొదలయ్యేలోపు మళ్లీ ఆ లుక్ లోకి రావాలని కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

ఇక “ఫిదా “, “తొలి ప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్ ” ఇలా వరుస హిట్స్ తో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. మరి ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ ను అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 4 =