ఆగష్ట్ లో సెట్స్ పైకి రానా-రవితేజ సినిమా..!

Mass Maharaja Ravi Teja and Rana Upcoming Movie To Hit The Floors In August
Mass Maharaja Ravi Teja and Rana Upcoming Movie To Hit The Floors In August

మలయాళం సూపర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎప్పుడో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘స్వామిరారా’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారని టాక్. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కథ లో కొన్ని మార్పులు చేయనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఆగష్ట్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.

కాగా, ‘అయ్యప్పనుమ్ కొషియం’ మంచి యాక్షన్ థ్రిల్లర్. పృథ్విరాజ్ సుకుమారన్, బిజు మీనన్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సాచీ దర్శకత్వం వహించారు. రిటైర్డ్ ఆర్మీ హవల్దార్‌ అయ్యప్పన్ నాయర్‌గా పృథ్వీరాజ్, పోలీస్ ఆఫీసర్ కొషీ కురియన్ బిజు మీనన్ నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.