స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కు మహేష్ బర్త్ డే విషెస్..!

Super Star Mahesh Babu Pour Heartfelt Wishes To Director Koratala Siva On His Birthday
Super Star Mahesh Babu Pour Heartfelt Wishes To Director Koratala Siva On His Birthday

వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భరత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టాడు. అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యాల‌ను సాధించివ‌వే. ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు కొర‌టాల శివ పుట్టిన‌రోజు కావడంతో… ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ నేపథ్యంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కొర‌టాల‌ను బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ ‘‘నా ప్రియమైన స్నేహితుడు, విజనరీ డైరెక్టర్ కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తనకు ఎప్పుడూ శాంతి, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా చిరు ఆచార్య తర్వాత యంగ్ హీరోలతో సినిమా చేయాలన్న ప్లాన్ లో వున్నాడట కొరటాల. కొరటాల తర్వాత లిస్ట్ లో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరితోనూ సంప్రదింపులు జరుపుతున్నాడట దర్శకుడు. చూద్దాం మరి ఎవరితో ఉంటుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.