#Prabhas 20 మూవీ కి భారీ సెట్

Prabhas 20 Movie Team To Erect A Massive Georgia City Set At Ramoji Film City For Movie Shooting

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “#Prabhas 20” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న ఈ మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కు ముందు “#Prabhas 20” మూవీ జార్జియా లో షూటింగ్ జరుపుకుంది. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా చిత్ర యూనిట్ ఇండియా కు చేరుకుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జార్జియా లో షూటింగ్ జరపడం కష్టం కనుక ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హెదరాబాద్ లో చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీ లో జార్జియా బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్ ను రూపొందించి షూటింగ్ జరపనున్నారని సమాచారం. దేశవ్యాప్తం గా అభిమానులున్న ప్రభాస్ నటించే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + two =