ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ‘ఇస్మార్ట్ భామ’…?

Ismart Shankar Actress Nabha Natesh Grabs Golden Chance To Act Alongside Jr NTR In Upcoming Trivikram Directorial

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్ర మరింత పేరును సంపాదించి పెట్టడమే కాదు ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. నభా ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్ “, అల్లుడు అదుర్స్” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా నితిన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ లో కూడా నభా ను తీసుకోనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వింటూనే వున్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే టైటిల్ ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నభా నటేష్ ను అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడిన సంగతి తెలిసిందే కదా.. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నభా అయితే కరెక్ట్ గా సరిపోతుందని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. అదే కనుక నిజమైతే అమ్మడు అదృష్టవంతురాలే. చూద్దాం మరి నభా లక్ ఎలావుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =